భోగి–సంక్రాంతి–కనుమ శుభాకాంక్షలు తెలిపిన మాల కమిటీ నాయకులు

 

భోగి–సంక్రాంతి–కనుమ శుభాకాంక్షలు తెలిపిన మాల కమిటీ నాయకులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని సన్యాసి బస్తీ ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగల శుభాకాంక్షలు మాల కమిటీ నాయకులు తెలియజేశారు. పండుగల సందర్భంగా ప్రజలు ఆనందంగా, ఐక్యంగా, సంతోషంగా జరుపుకోవాలని కోరుతూ మాల కమిటీ అధ్యక్షులు అలుగోలు పైడిరాజు, ఉపాధ్యక్షులు ముద్దం రాము, ప్రధాన కార్యదర్శి గడసాని వినేష్ బాబు, ముఖ్య కార్యవర్గ ప్రతినిధి మంచినీళ్ల విజయ్ బాబు, కార్యదర్శి ఎజ్జల సురేష్, సలహాదారులు మిరియాల రాము, కోశాధికారి మొయ్య సూర్యనారాయణతో పాటు కమిటీ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కమిటీ నాయకులు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి పండుగలు జరుపుకుంటూ పరస్పర ప్రేమాభిమానాలు పెంపొందించాలని ప్రజలను పిలుపునిచ్చారు. పండుగల సందర్భంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, గాలి పటాలు, బాణాసంచా వాడకంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అలాగే పండుగల సందర్భంగా బస్తీ పరిసరాల్లో శుభ్రత, పారిశుధ్యాన్ని కాపాడాలని, ప్రభుత్వము చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పేదలు, నిరుపేదలు, వృద్ధులు ఎవరూ ఒంటరిగా ఉండకుండా సహాయం చేయడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని నాయకులు అభిప్రాయపడ్డారు.

పండుగలు ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ప్రతీ ఇంటా ఆనందం, సుఖశాంతులు నెలకొనాలని ఆకాంక్షిస్తూ సన్యాసి బస్తీ ప్రజలందరికీ మళ్లీ మరొక్కసారి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.