కూకట్‌పల్లిలో గ్యాస్ సిలిండర్ పేలుడు కలకలం

 

కూకట్‌పల్లిలో గ్యాస్ సిలిండర్ పేలుడు కలకలం

హైదరాబాద్‌ కూకట్‌పల్లి ప్రాంతంలోని రాజీవ్ గాంధీ నగర్‌లో గ్యాస్ సిలిండర్లు వరుసగా పేలిన ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. సమాచారం ప్రకారం, అక్కడ ఉన్న ఓ మొబైల్ ఫోన్ షాపులో అక్రమంగా గ్యాస్ రీఫీలింగ్‌ జరుగుతున్నట్లు వెల్లడైంది. ఇదే సమయంలో ఒక్కసారిగా సిలిండర్లలో లీకేజ్ ఏర్పడి భారీ శబ్దంతో పేలుడు సంభవించింది.

పేలుడు ప్రభావంతో దుకాణంలో ఉన్న వస్తువులు ధ్వంసమయ్యాయి. సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు పెద్ద శబ్దం విని బయటకు పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో, వారు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది.

ప్రాథమిక సమాచారం మేరకు, అక్కడ అవసరమైన లైసెన్సులు లేకుండానే చిన్న గ్యాస్ సిలిండర్లు అక్రమంగా నింపుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. షాపు యజమానిని అదుపులోకి తీసుకుని అక్రమ రీఫీలింగ్‌పై ప్రశ్నిస్తున్నారు.

పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ, ఇలాంటి అనధికారిక రీఫీలింగ్ కేంద్రాలను గమనించిన వెంటనే సమాచారాన్ని అందించాలని సూచించారు. గ్యాస్ సిలిండర్లను రీఫీల్ చేసే సమయంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోతే భారీ ప్రమాదాలకు దారితీస్తాయని అధికారులులు హెచ్చరించారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.