ఘనంగా TBGKS ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జెండా ఆవిష్కరించిన ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ


కొత్తగూడెం, జనవరి 27: తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) 23వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం కొత్తగూడెం ఏరియాలో ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెం ఏరియా వైస్‌ ప్రెసిడెంట్ గడప రాజయ్య ఆధ్వర్యంలో, ఏరియాలోని గనులు మరియు వివిధ డిపార్ట్‌మెంట్లలోని యూనియన్ కార్యాలయాల వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి.

రామవరం లోని TBGKS యూనియన్ కార్యాలయం, వీకే-7 ఓపెన్ కాస్ట్, పీవీకే ప్రాంతాల్లో ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2003 జనవరి 27న ప్రొఫెసర్ జయశంకర్, కొప్పుల ఈశ్వర్ గారి చేతుల మీదుగా TBGKS సంఘం ప్రారంభించబడిందని, ఈ రోజు 23వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు.

సింగరేణిలో జాతీయ సంఘాలను పక్కనపెట్టి, కార్మికులు TBGKS‌ను తమ గుండెల్లో నిలుపుకున్నారని పేర్కొన్నారు. కార్మికుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, జాతీయ సంఘాలు కోల్పోయిన కారుణ్య నియామకాలను తిరిగి సాధించామని, దాని ద్వారా సుమారు 17 వేల మంది కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు లభించాయని వెల్లడించారు.

TBGKS కోరిక మేరకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి కార్మికులకు ఎన్నో హక్కులు కల్పించారని, ముఖ్యంగా తెలంగాణ ఇంక్రిమెంట్, ఉచిత విద్యుత్, తల్లిదండ్రులకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం వంటి సౌకర్యాలు అందాయని గుర్తు చేశారు.

గత రెండు సంవత్సరాలుగా సింగరేణిలో ఉన్న కొన్ని సంఘాలు యాజమాన్యంతో కుమ్మక్కై కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. రాబోయే సింగరేణి ఎన్నికల్లో TBGKS ఘన విజయం సాధించి, మరోసారి కార్మికుల హక్కులు మరియు ఆత్మగౌరవాన్ని కాపాడుతుందని ధీమా వ్యక్తం చేశారు. గులాబీ జెండా తెలంగాణ అభివృద్ధికి, ప్రజల అభివృద్ధికి ప్రతీక అని, ఇది తెలంగాణ జెండానే అని కార్మికులు ఆదరించాలని కోరారు. ఈ సందర్భంగా కార్మికులకు స్వీట్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో TBGKS సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బోరింగ్ శంకర్, సెంట్రల్ కమిటీ మెంబర్ కాగితపు విజయ్ కుమార్, అరుణ్, ఫిట్ సెక్రటరీలు రాజకుమార్, వెంకటేశ్వర్లు, సంతోష్, ఆంజనేయులు, రాజేష్, సుధాకర్, అనుదీప్, బాలాజీ, అశోక్, కోటేశ్వరరావు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు

Blogger ఆధారితం.