కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా కేరళలో నేడు ‘బ్లాక్ డే’
తిరువనంతపురం | ఫిబ్రవరి 03: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేరళ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని సీపీఎం తీవ్రంగా ఖండించింది. బడ్జెట్‌లో కేరళకు చోటు లేకుండా వ్యవహరించిన తీరు చూస్తే, దేశంలో కేరళ అనే రాష్ట్రం లేనట్లుగా కేంద్రం వ్యవహరిస్తోందని సీపీఎం విమర్శించింది.
కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత విధానాలు, కేరళ పట్ల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ‘బ్లాక్ డే’ను నిర్వహిస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని బూత్‌ల వద్ద నల్లజెండాలు ఎగురవేసి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చింది.
బడ్జెట్ రూపకల్పనకు ముందే కేరళ ప్రభుత్వం కేంద్రం ముందు మొత్తం 29 డిమాండ్లను ఉంచిందని సీపీఎం వెల్లడించింది. అయితే, వాటిలో ఒక్క డిమాండ్‌ను కూడా మోడీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించింది. ఇది కేంద్ర ప్రభుత్వ కేరళ వ్యతిరేక ధోరణికి నిదర్శనమని సీపీఎం వ్యాఖ్యానించింది.

Post a Comment