మాదాపూర్‌ కేబుల్ బ్రిడ్జిపై ద్విచక్ర వాహనంలో మంటలు చెలరేగిన ఘటన కలకలం

మాదాపూర్‌ కేబుల్ బ్రిడ్జిపై ద్విచక్ర వాహనంలో మంటలు చెలరేగిన ఘటన కలకలం


కొండాపూర్, ఫిబ్రవరి 3 : మాదాపూర్‌లోని కేబుల్ బ్రిడ్జిపై నడుస్తున్న ద్విచక్ర వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్ నెంబర్ 45 వైపు నుంచి ఐకియా దిశగా తన ద్విచక్ర వాహనం (పల్సర్)పై వెళ్తున్న కొమనంతల జతిన్, కేబుల్ బ్రిడ్జిపైకి రాగానే బైక్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

మంటలను గమనించిన జతిన్ వెంటనే అప్రమత్తమై బైక్‌ను రోడ్డుపక్కన ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే అప్పటికే మంటలు తీవ్రరూపం దాల్చడంతో ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమైంది.

ఈ ఘటనతో కేబుల్ బ్రిడ్జిపై వెళ్తున్న వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.