సమ్మక్క సారక్క జాతరను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : మంత్రి దనసరి సీతక్క

సమ్మక్క సారక్క జాతరను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : మంత్రి దనసరి సీతక్క


ములుగు నిన్నటి వరకు జాతర సందర్భంగా దర్శనాలు సజావుగా కొనసాగాయని పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి దనసరి సీతక్క తెలిపారు. ట్రాఫిక్ విషయంలో మాత్రమే స్వల్ప ఇబ్బందులు ఎదురయ్యాయని, ఆ ఒక్కటిని మినహాయిస్తే జాతర నిర్వహణ సంతృప్తికరంగా జరిగిందన్నారు.

జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన ప్రభుత్వ శాఖలు, అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు మరియు భక్తులకు మంత్రి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం, అధికారులు చిత్తశుద్ధితో, భక్తితో కలిసి పనిచేయడం వల్లే జాతర విజయవంతమైందని ఆమె పేర్కొన్నారు.

భవిష్యత్తులో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని, అలాగే జాతర అనంతరం మిగిలిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని మంత్రి దనసరి సీతక్క స్పష్టం చేశారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.