ప్రేమించిన వ్యక్తి కోసం… వివాహిత వింత నాటకం

 

ప్రేమించిన వ్యక్తి కోసం… వివాహిత వింత నాటకం

ప్రియుడితో కలిసి వెళ్లిపోవాలనే ఉద్దేశంతో ఓ యువతి ఆశ్చర్యపరిచే నాటకానికి తెరతీసింది. తాను నాగదేవతగా మారిపోయానని, నాగలోకానికి వెళ్లిపోతున్నానని తల్లిదండ్రులను నమ్మించే ప్రయత్నం చేసింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఔరాయా జిల్లా సింగణపూర్ గ్రామానికి చెందిన రీనా (20) అనే యువతి, అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. అతనితో కలిసి వెళ్లిపోవాలని ముందుగానే ప్లాన్ చేసిన ఆమె, గత రెండు నెలలుగా తల్లిదండ్రులకు “కలలో నాగదేవతలు కనిపిస్తున్నాయి… నన్ను తమ లోకానికి రమ్మంటున్నాయి” అని చెబుతూ వచ్చింది.

ఈ క్రమంలో సమీపంలోని నాగదేవత ఆలయం నుంచి ఒక విగ్రహాన్ని తీసుకుని ఇంట్లో పూజలు చేయడం ప్రారంభించింది. ఆదివారం ఆలయానికి వెళ్లి పాములు పట్టే వారితో మాట్లాడి ఐదు అడుగుల నాగుపాము కుబుసం తెచ్చుకుంది. ఆ రాత్రి బెడ్‌పై పాము కుబుసం, గాజులు, కుంకుమ వంటివి ఉంచి, తాను మానవ అవతారం ముగించి నాగలోకానికి వెళ్లిపోయినట్టు నమ్మించేలా ఏర్పాట్లు చేసింది. అనంతరం ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది.

ఉదయం తల్లిదండ్రులు ఆ దృశ్యం చూసి మొదట అయోమయానికి గురైనా, అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణలో ఇది యువతి ఆడిన నాటకమని పోలీసులు తేల్చారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆమె ఉన్న ప్రదేశాన్ని గుర్తించే చర్యలు చేపట్టారు.

ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రేమ కోసం యువతి సినిమా తరహాలో నాటకం ఆడిన విధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Blogger ఆధారితం.