క్రికెట్ ప్రపంచకప్ విజేతలైన భారత జట్టుకు ముఖ్యమంత్రి అభినందనలు

 

అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచకప్ విజేతలైన భారత జట్టుకు ముఖ్యమంత్రి అభినందనలు

అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విశ్వ వేదికపై భారత క్రీడాకారులు సాధిస్తున్న విజయ పరంపర దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు.

యువ ఛాంపియన్లు ప్రదర్శిస్తున్న అసమాన ప్రతిభ భారత క్రికెట్ భవిష్యత్తుకు మరింత భరోసా కలిగిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. అంకితభావం, నైపుణ్యం, పోరాట పటిమలో గత తరం క్రీడాకారుల స్ఫూర్తిని కొనసాగిస్తూ, నేటి యువత అత్యంత ఆత్మవిశ్వాసంతో అంతర్జాతీయ వేదికపై భారత కీర్తిని చాటుతున్నారని ప్రశంసించారు.

ఈ విజయం యువ క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తుందని, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.