వేములవాడ జాతర మహోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

వేములవాడ జాతర మహోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం


మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించనున్న జాతర మహోత్సవానికి హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, ఆలయ కార్యనిర్వాహక అధికారి రమాదేవి ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిసి అధికారిక ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం వేములవాడ ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు.


Blogger ఆధారితం.