హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్, మార్చి 27: దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ హోటల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లలో 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించిన బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్) కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (NCHM JEE 2026) నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్షలో సాధించిన ర్యాంక్ ఆధారంగా, నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ అనుబంధ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ కోర్సుల్లో సుమారు 12 వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఏప్రిల్ 1, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థులు ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంగ్లీష్ సబ్జెక్ట్ తప్పనిసరి. ఇంటర్ పూర్తిచేసిన లేదా ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు వివరాలు ఇలా ఉన్నాయి: జనరల్ అభ్యర్థులకు రూ.1000, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.700, ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ అభ్యర్థులకు రూ.450గా నిర్ణయించారు.
ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ 2026 రాత పరీక్ష ఏప్రిల్ 25న దేశవ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు.
హోటల్ మేనేజ్‌మెంట్ రంగంలో కెరీర్ చేయాలని ఆశించే విద్యార్థులకు ఇది మంచి అవకాశం కావడంతో, ఆసక్తి ఉన్న వారు గడువు లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Post a Comment