తెలంగాణకు వర్ష సూచన – మూడు రోజుల పాటు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముండగా, కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.
ఇప్పటికే వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటుండగా, కొన్ని ప్రాంతాల్లో వడగాళ్ల వాన కూడా పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ రోజు రాష్ట్రంలో గాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశముండగా, రేపు మరియు ఎల్లుండి గాలుల వేగం 30 నుంచి 40 కిలోమీటర్ల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. బలమైన ఈదురు గాలులతో పాటు మెరుపులు పడే అవకాశముండటంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందిగా సూచిస్తున్నారు.
ప్రత్యేకంగా బయటకు వెళ్లే వారు, రైతులు, విద్యుత్ స్తంభాలు లేదా చెట్ల సమీపంలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ పేర్కొంది.

Post a Comment