భద్రాచలంలో తుఫాన్ బోల్తా: ఇద్దరు మృతి, పది మందికి గాయాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చింతూరు మండల పరిధిలోని బొడ్డుగూడెం శివారులో తుఫాన్ వాహనం అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాద సమయంలో తుఫాన్ వాహనంలో మొత్తం 12 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరు భద్రాచలం నుండి చింతూరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Post a Comment