జాతీయ చరిత్ర సదస్సు కోసం ఢిల్లీకి బయలుదేరిన ఇస్మాయిల్ దంపతులు

 

జాతీయ చరిత్ర సదస్సు కోసం ఢిల్లీకి బయలుదేరిన ఇస్మాయిల్ దంపతులు

హైదరాబాద్: ఇండియన్ హిస్టరీ ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 11, 12 తేదీలలో న్యూఢిల్లీ లోని భారత ఇస్లామిక్ సాంస్కృతిక కేంద్రం (లోధి నగర్)లో నిర్వహించనున్న 2026 జాతీయ చరిత్ర సదస్సుకు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులుగా ఇస్లామిక్ సోషల్ సర్వీస్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్, జాతీయ కార్మిక నేత, ఇస్లామిక్ పండితుడు ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ మరియు ఆయిషా సిద్ధిఖ దంపతులు ఈ రోజు బయలుదేరారు.

వారు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. ఈ సందర్భంగా వారిని విమానాశ్రయానికి వెళ్లి సాగనంపిన వారిలో సయ్యద్ అబ్దుల్లా సల్మాన్, అర్షియా గుల్జార్, ఉబెదుల్లా, జావేరియా, అబ్దుల్ రెహమాన్, సయ్యదా మైమా తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.