రైలు ప్రయాణంలో చెత్త వేస్తే భారీ జరిమానా!
రైల్వేల్లో ఇక నిర్లక్ష్యానికి చోటు లేదు. Indian Railways పరిశుభ్రతపై కఠినంగా వ్యవహరిస్తోంది. క్లీన్ రైల్వే కార్యక్రమంలో భాగంగా ఒక్కరోజులోనే 1,447 మంది ప్రయాణికులపై చర్యలు తీసుకుని మొత్తం రూ.2,89,400 జరిమానా విధించారు.
ఇటీవల ఒక కుటుంబం ఇంటి నుంచి తెచ్చుకున్న ఆహారం తిన్న తర్వాత చెత్తను సీట్ల కింద వేయడంతో రైల్వే అధికారులు వారికి భారీ జరిమానా విధించిన ఘటన కూడా చోటుచేసుకుంది.
👉 అధికారులు చెబుతున్నది స్పష్టమే:
- రైల్వే బోగీలు, ప్లాట్‌ఫార్మ్‌లను చెత్తతో కలుషితం చేయడం శిక్షార్హమైన నేరం
- చెత్తను తప్పనిసరిగా డస్ట్‌బిన్‌లోనే వేయాలి
🚨 ప్రయాణికులు జాగ్రత్త: చిన్న నిర్లక్ష్యం కూడా ఇప్పుడు మీ జేబుకి పెద్ద భారం కావచ్చు!

Post a Comment