అంబేద్కర్ జాతీయ అవార్డు అందుకున్న మహమ్మద్ ముస్తఫా

 

అంబేద్కర్ జాతీయ అవార్డు అందుకున్న మహమ్మద్ ముస్తఫా

అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో రామవరం పరిరక్షణ సమితి అధ్యక్షుడు మహమ్మద్ ముస్తఫా ప్రతిష్టాత్మక డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నేషనల్ అభ్యుదయ రత్న – 2026 అవార్డును అందుకున్నారు.

భారత ప్రభుత్వ నీతి ఆయోగ్ గుర్తింపు పొందిన “మనం ఫౌండేషన్” ఆధ్వర్యంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. బుధవారం రాత్రి త్యాగరాయ గాన సభలో జరిగిన వేడుకలో ప్రముఖుల సమక్షంలో ముస్తఫాకు అవార్డు అందజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంస్థ ఫౌండర్, నేషనల్ చైర్మన్ డా. కె. చక్రవర్తి, మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాల చారి, న్యూమరాలజిస్ట్ దివంగశర్మ, రిటైర్డ్ జడ్జ్ బూర్గుల మధుసూదన్, రిటైర్డ్ ఐఏఎస్ బి. లక్ష్మీకాంతం, రిటైర్డ్ ఎస్పీ ఎస్.ఎం. రత్న, అష్టావధాని సురభి శంకర శర్మ, రిటైర్డ్ డీఎస్పీ డాక్టర్ జి. సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

రామవరం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధిని దేశాభివృద్ధిగా భావిస్తూ, కరపత్రాలు, కవితల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నందుకు గాను ఈ అవార్డు ముస్తఫాకు వరించింది.

ఈ సందర్భంగా ప్రకృతి పర్యావరణ ప్రేమికులు మొక్కల వెంకటయ్య, మొక్కల రాజశేఖర్, సుగుణారావు, తూముల శ్రీనివాస్, సావేటి స్వామి, నజీర్, తులసిరామ్, యశ్వంత్, కొయ్యడ వెంకటేశ్వర్లు, రాజారాం, దశరథ్ రాజు తదితరులు ముస్తఫాను అభినందించారు.

Blogger ఆధారితం.