జూలూరుపాడు పీహెచ్‌సీ భద్రాద్రి జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

 

జూలూరుపాడు పీహెచ్‌సీ భద్రాద్రి జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసరాలు, వివిధ విభాగాల పనితీరును సమగ్రంగా పరిశీలిస్తూ వైద్య సేవల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించారు.

ఇన్‌పేషెంట్ వార్డును సందర్శించిన కలెక్టర్, రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న చికిత్సపై వివరాలు తెలుసుకున్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.

ఔట్‌పేషెంట్ విభాగం పరిశీలనలో భాగంగా సహాయం కోరిన ఓ వృద్ధుడి విషయంపై వెంటనే స్పందించి, అతనిని మెరుగైన చికిత్స కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని కలెక్టర్ అంకిత్ తెలిపారు.

Blogger ఆధారితం.