JIH ఈద్ మిలాఫ్ ఇంటికి వెలుగు ఇల్లాలు – డా. నవ జ్యోతి

JIH ఈద్ మిలాఫ్ ఇంటికి వెలుగు ఇల్లాలు – డా. నవ జ్యోతి


చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామ పంచాయతీలో జమాతే ఇస్లామి హింద్ ఆధ్వర్యంలో నిర్వహించిన “ఈద్ మిలాఫ్” కార్యక్రమం ఆనందోత్సాహాలతో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డా. నవ జ్యోతి మాట్లాడుతూ, స్త్రీలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చి రాణించాలని ఆకాంక్షించారు. కులమతాలకు అతీతంగా మహిళలు కలిసి ఒకరి పండుగలను, సంస్కృతులను మరొకరు పంచుకోవడం సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.

మరో అతిథి ఉపాధ్యాయురాలు లక్ష్మి మాట్లాడుతూ, ప్రతి స్త్రీకి విద్య అనేది అత్యంత అవసరమని, విద్యావంతులైన మహిళల వల్లే సమాజంలో సానుకూల మార్పులు సాధ్యమవుతాయని తెలిపారు.

సేవ సమితి సభ్యురాలు సత్యావతి మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా జమాతే ఇస్లామి హింద్ సంస్థ వైద్య, విద్య, వివాహాల వంటి అంశాల్లో అందిస్తున్న సేవలను ప్రశంసించారు.

జమాతే ఇస్లామి హింద్ అధ్యక్షురాలు మాట్లాడుతూ, మనందరికీ సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే అని, పరస్పర సహకారం, ఐక్యతతో జీవించడం ద్వారానే దైవ అనుగ్రహం లభిస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో జమాత్ సభ్యులు పర్వీన్ సుల్తాన్, నష్రా, పర్వీన్ బాను, షేహనాజ్, పర్వీన్ షమీం, ఆశా వర్కర్లు జ్యోతి, అంగన్‌వాడీ టీచర్లు సరస్వతీ, జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయురాలు రాధ, రజీయా, వార్డు సభ్యురాలు అరీపా తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.