మైనార్టీలకు సివిల్స్‌లో ఉచిత శిక్షణ మే 31లోపు దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్ / గోదావరిఖని / న్యూఢిల్లీ: యూపీఎస్సీ-2027 సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న మైనారిటీ అభ్యర్థులు తెలంగాణ మైనార్టీస్ స్టడీ సర్కిల్ అందిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ తెలిపారు. ఆయన జమాత్-ఎ-ఇస్లామీ హింద్ ఉపాధ్యక్షుడిగా, టెమ్రీస్ కౌన్సలర్‌గా, హెచ్‌ఎంఎస్ కేంద్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండి, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మూడేళ్ల డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులని ఆయన పేర్కొన్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 31వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
దరఖాస్తుల కోసం:
TMREIS దరఖాస్తు వెబ్‌సైట్�
అర్హులైన అభ్యర్థులకు జూన్ 14న రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోని సమీప మైనారిటీ గురుకులాల్లో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. స్క్రీనింగ్ టెస్ట్‌లో మెరిట్ సాధించిన అభ్యర్థులలో 100 మందిని ఎంపిక చేసి ఉచిత శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు.
ఈ అవకాశాన్ని రాష్ట్రంలోని ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైన్, బౌద్ధ, పార్శి మతాలకు చెందిన మైనారిటీ అభ్యర్థులు వినియోగించుకోవాలని కోరారు.
ఇతర వివరాల కోసం 040-23236112 నంబర్‌ను ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు సంప్రదించవచ్చని తెలిపారు.

Post a Comment