కలెక్టర్ చేతుల మీదుగా దివ్యాంగుడికి బ్యాటరీ వీల్ చైర్ పంపిణీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్ IAS చేతుల మీదుగా దివ్యాంగుడికి బ్యాటరీ వీల్ చైర్ అందజేశారు. దివ్యాంగుల సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన చిలకాల నరేష్‌కు బ్యాటరీ వీల్ చైర్‌ను పంపిణీ చేశారు. టీజీఓబిఎంఎంఎస్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న నరేష్‌ను జిల్లా సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి దివ్యాంగుడు ప్రభుత్వ పథకాలను వినియోగించుకొని స్వయం ఆధారిత జీవనం గడపాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా కలెక్టర్ డి. వేణుగోపాల్, జిల్లా సంక్షేమ అధికారిణి జె.ఎమ్. స్వర్ణలతా లెనినా, మహిళా, శిశు, వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Post a Comment