ఇందిరమ్మ ఇండ్ల పథకంతో సొంతింటి కల సాకారం టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు
TA9 వనిత ప్రతినిధి, సుజాతనగర్: మండలంలోని గరీబ్‌పేట పంచాయతీలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఆదివారం టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పాల్గొని ఇంటిని ప్రారంభించారు. లబ్ధిదారులైన రజిత–సతీష్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారితో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ పేద కుటుంబాలకు సొంత ఇల్లు కల్పించడం ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా స్థిరమైన నివాసం కల్పిస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
కొత్తగూడెం నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ముఖ్యమంత్రి Revanth Reddy, గృహనిర్మాణ శాఖ మంత్రి Ponguleti Srinivasa Reddy సహకారంతో ప్రతి అర్హత కలిగిన పేద కుటుంబానికి ఇల్లు అందేలా కృషి చేస్తానని ఆయన పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు, గరీబ్‌పేట సర్పంచ్ కూసం దివ్యతేజ, ఉప సర్పంచ్ రెడ్డిబోయిన వెంకన్న, మాజీ ఎంపీటీసీ కసనబోయిన భద్రం, మైనారిటీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ కరీంపాషా, ఓబీసీ మండల అధ్యక్షుడు కసనబోయిన లక్ష్మణ్, విద్యాకమిటీ చైర్మన్ కట్టెబోయిన లింగమల్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొమ్మనబోయిన సైదులు, తిరుపతి యాదవ్, యువజన కాంగ్రెస్ నాయకులు గుగులోతు కోటేష్, సాయిచంద్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment