సింగరేణి పరిరక్షణ సదస్సు విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు: కాపు కృష్ణ

 

సింగరేణి పరిరక్షణ సదస్సు విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు: కాపు కృష్ణ

సింగరేణి పరిరక్షణ సదస్సు విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు: కాపు కృష్ణ

కొత్తగూడెం క్లబ్‌లో జూన్ 23న నిర్వహించిన "సింగరేణి పరిరక్షణ సదస్సు" విజయవంతం కావడానికి సహకరించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్మిక సోదరులు, మీడియా ప్రతినిధులు మరియు సానుభూతిపరులందరికీ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీష్ రావు సింగరేణి సంస్థ ఎదుర్కొంటున్న సమస్యలు, కార్మికుల పరిస్థితులు, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్న పరిస్థితులు మరియు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చోటుచేసుకున్న మార్పులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PPT) ద్వారా కార్మికులకు వివరించడం అభినందనీయమని కాపు కృష్ణ పేర్కొన్నారు. సింగరేణి సంస్థ పరిరక్షణకు సంబంధించిన కీలక అంశాలను సమగ్రంగా వివరించినందుకు హరీష్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అలాగే సదస్సుకు హాజరైన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీలు తాతా మధు, తక్కలపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, హరిప్రియ నాయక్తో పాటు దిండిగల రాజేందర్, ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సింగరేణి పరిరక్షణ సదస్సును విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ భూమి కార్మిక సంఘం నాయకులు, కార్యకర్తలు, డీఎల్ఆర్ కార్మికులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు కాపు కృష్ణ పేర్కొన్నారు.

సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధన కోసం భవిష్యత్తులో కూడా ఐక్యంగా పోరాటం కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.

Blogger ఆధారితం.