పచ్చని ప్రకృతి – మన భవిష్యత్తు రచన: మంజుల పత్తిపాటి

పచ్చని ప్రకృతి – మన భవిష్యత్తు రచన: మంజుల పత్తిపాటి

పచ్చని ప్రకృతి – మన భవిష్యత్తు రచన: మంజుల పత్తిపాటి

ఒకప్పుడు పక్షుల కిలకిలారావాలతో మేల్కొన్న ఉదయం... ఈ రోజు మొబైల్ ఫోన్ల అరుపులతో తడబడుతోంది. మనిషి అభివృద్ధి పేరుతో అడవులను నరికేస్తే... రేపటి పిల్లల చేతుల్లో పుస్తకాలు కాదు, ఆక్సిజన్ బాటిళ్లను మోయాల్సిన పరిస్థితి వస్తుంది. 

ఒకప్పుడు చెట్టు నీడలో కూర్చుని తల్లి జోలపాట పాడేది...కానీ ఇప్పుడు నరికిన చెట్ల రక్తంతో నిర్మించిన కాంక్రీట్ గోడల మధ్య ఊపిరాడక బంధీలమై జీవించాల్సి వస్తోంది.

ప్రకృతిని జయించానని భావించిన మనిషి చివరికి ఒక నీటి బొట్టుకోసం ఆకాశం వైపు చేతులు చాచే రోజులు ఎంతో దూరంలో లేవు.

మనిషి చేతుల్లో ఇప్పుడు మొబైల్ ఫోన్లు ఉన్నాయి, కానీ మట్టివాసనను తాకే వేళ్లు లేవు. ఎయిర్ కండిషన్ గదుల్లో ఊపిరాడక అలమటించే సమయంలో డబ్బు కట్టలు చేతబట్టి ఒక ఆక్సిజన్ చుక్క కోసం ప్రకృతిని వేడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.

కాంక్రీట్ అడవుల్లో మునిగిపోయిన మనిషి చెట్ల నుంచి వినిపించే మధుర రాగాలను ఆస్వాదించే యోగ్యతను కోల్పోతున్నాడు. ఆకుపచ్చ భూమి ఆర్తనాదం...ఎండిపోయిన నదుల గుండె చప్పుడు... విని పలికిన ప్రతి మాటలో మట్టివాసన గొప్పతనాన్ని మన హృదయాల్లో నాటే ప్రయత్నమే ఈ స్వరం.

నరికిన చెట్ల నీడల్లో... చెదిరిన పక్షుల గూటిల్లో... ప్రకృతి బాధను కన్నీటి చుక్కగా కాదు, అగ్నిజ్వాలగా పలికించే స్వరం మంజుల పత్తిపాటి. ఒక మొక్క నాటడానికి... ఒక నదిని కాపాడడానికి... ఒక పక్షి గూటిని నిలబెట్టడానికి... మన శ్వాసను నిలుపుకోవడానికి... ఇంకా సమయం ఉంది. జూన్ 5 – ప్రపంచ పర్యావరణ దినోత్సవం మనకు ఒక సందేశం ఇస్తోంది...

“ప్రకృతిని రక్షించండి... భవిష్యత్తును కాపాడండి...” మనమందరం కలిసొస్తే పచ్చని ప్రపంచం నవ్వుతుంది. ప్రకృతిని ప్రేమిద్దాం... పర్యావరణాన్ని పరిరక్షిద్దాం... పచ్చని భూమి మన అందరి బాధ్యత. 

ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలతో...

– ప్రకృతి ముద్దుబిడ్డ

మంజుల పత్తిపాటి, మాజీ డైరెక్టర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ, ఆలేరు, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ, చరవాణి: 9347042218.

Blogger ఆధారితం.