తెలంగాణ రక్షణ సేన 23 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జీల జాబితా

 

తెలంగాణ రక్షణ సేన 23 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జీల జాబితా

తెలంగాణ రక్షణ సేన 23 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జీల జాబితా

హైదరాబాద్, జూలై 15: తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్రవ్యాప్తంగా సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో తొలి విడతగా 23 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలను పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, తనకు అదృష్ట సంఖ్యగా భావించే 5కు అనుగుణంగా మొత్తం 23 మంది ఇన్‌చార్జీలను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. అలాగే ఆషాఢ మాసంలో శుభ ముహూర్తాన్ని పురస్కరించుకుని ఈ నియామకాలను ప్రకటించినట్లు పేర్కొన్నారు.

మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా దశలవారీగా ఇన్‌చార్జీలను నియమించనున్నట్లు పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. పార్టీ విస్తరణ, సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే ఈ నియామకాల ప్రధాన ఉద్దేశమని పార్టీ నాయకత్వం తెలిపింది.






Blogger ఆధారితం.