రమణమూర్తిపై దాడి హేయమైన చర్య – బొమ్మెర శ్రీనివాస్ ఖండన
రమణమూర్తిపై దాడి హేయమైన చర్య – బొమ్మెర శ్రీనివాస్ ఖండన
కొత్తగూడెం, జూలై 15: బీఆర్‌కే న్యూస్ ఛానల్ ముఖాముఖి చర్చల సందర్భంగా విజయ విహారం పత్రిక ఎడిటర్, జై భారత్ అధినేత రమణమూర్తిపై జరిగిన దాడిని షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి (జేఏసీ) వ్యవస్థాపక అధ్యక్షుడు బొమ్మెర శ్రీనివాస్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడ రమేష్ తీవ్రంగా ఖండించారు.
బుధవారం కొత్తగూడెంలో విడుదల చేసిన ప్రకటనలో వారు మాట్లాడుతూ, మతం ముసుగులో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఇటువంటి దాడులకు పాల్పడడం అత్యంత హేయమైన చర్య అని పేర్కొన్నారు. చర్చా కార్యక్రమంలో రమణమూర్తిపై చెప్పుతో దాడి చేయడం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే చర్య అని విమర్శించారు.
భారత రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ప్రశ్నించే ధోరణితో భౌతిక దాడులకు దిగడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదని అన్నారు. ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా, అన్ని మతాలను గౌరవించాలని ఎప్పటికప్పుడు చెప్పే వ్యక్తిపై దాడి చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు ఈ ఘటనను ముక్తకంఠంతో ఖండించాలని వారు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం దాడికి పాల్పడిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని బొమ్మెర శ్రీనివాస్, గోడ రమేష్ డిమాండ్ చేశారు.

Post a Comment