నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు రూ.2.77 లక్షల చెక్కుల పంపిణీ

నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు రూ.2.77 లక్షల చెక్కుల పంపిణీ

నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు రూ.2.77 లక్షల చెక్కుల పంపిణీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నవ లిమిటెడ్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కార్యక్రమాల్లో భాగంగా నిర్వహిస్తున్న నవ మహిళా సాధికార కేంద్రం మహిళల ఆర్థిక సాధికారతకు మరోసారి వేదికగా నిలిచింది. కేంద్రంలో మహిళలు తయారు చేసిన తాటి ఆకుల కళాకృతుల విక్రయం, గార్మెంట్ మేకింగ్ కార్యకలాపాల ద్వారా వచ్చిన రూ.2,77,362 ఆదాయానికి సంబంధించిన చెక్కులను తెలంగాణ ఆపరేషన్స్ యూనిట్ హెడ్ రియర్ అడ్మిరల్ ఎల్.వి. శరత్ బాబు (వి) మహిళలకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా శరత్ బాబు మాట్లాడుతూ, మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తే కుటుంబంతో పాటు సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని, వారి అభివృద్ధితో కుటుంబాల్లో సంతోషం, స్థిరత్వం నెలకొంటాయని పేర్కొన్నారు. మహిళల నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ ఉపాధి అవకాశాలు కల్పించడమే నవ లిమిటెడ్ లక్ష్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీజీఎం (హెచ్‌ఆర్‌ఏ) శ్రీనివాస్ రెడ్డి, సీఎస్‌ఆర్ సీహెచ్ శ్రీనివాసరావు ఆముదతో పాటు నవ మహిళా సాధికార కేంద్రానికి చెందిన మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగగా, చెక్కులు అందుకున్న మహిళలు సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.

Blogger ఆధారితం.