ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్) గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ అంకిత్ IAS శుక్రవారం తనిఖీ చేశారు. భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ప్రతి నెలా ఈవీఎంల భద్రతా ఏర్పాట్లను క్రమం తప్పకుండా పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు.

తనిఖీలో భాగంగా స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన ఈవీఎంలు, వీవీప్యాట్ (VVPAT) యంత్రాలను పరిశీలించారు. అనంతరం సీసీ కెమెరా నియంత్రణ గదిని సందర్శించి కెమెరాల పనితీరు, రికార్డింగ్ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందా లేదా అనే అంశాలను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా గోడౌన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అలాగే ఎలాంటి పరిస్థితుల్లోనూ అనుమతి లేని వ్యక్తులను ఈవీఎం గోడౌన్‌లోకి అనుమతించరాదని స్పష్టం చేశారు.

తదనంతరం ఈవీఎం గోడౌన్ తనిఖీ రిజిస్టర్లను పరిశీలించి సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఆర్డీవో మధు, ఎన్నికల సూపరింటెండెంట్ రంగ ప్రసాద్, ఎన్నికల మాస్టర్ ట్రైనర్ పూసపాటి సాయి కృష్ణ, ఎన్నికల సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.