ఎన్‌హెచ్-44పై భద్రతా పర్యవేక్షణ మరింత పటిష్టం చేయాలి: అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్
ఎన్‌హెచ్-44పై భద్రతా పర్యవేక్షణ మరింత పటిష్టం చేయాలి: అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్
తూప్రాన్, జూలై 7: జాతీయ రహదారి-44పై భద్రతా పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఐపీఎస్ అధికారులకు సూచించారు.
మంగళవారం తూప్రాన్ టోల్‌గేట్ వద్ద ఉన్న కంట్రోల్ రూమ్‌ను ఆయన సందర్శించి సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఎన్‌హెచ్-44పై వాహనాల రాకపోకలను నిరంతరం పర్యవేక్షిస్తూ అనుమానాస్పద వాహనాలు, వ్యక్తుల కదలికలను వెంటనే గుర్తించి సంబంధిత పోలీసు స్టేషన్లకు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు.
సీసీ కెమెరాలు ఎల్లప్పుడూ పనిచేసేలా నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించిన అదనపు ఎస్పీ, అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది తీసుకునే చర్యలు, సమాచార సేకరణ, స్థానిక పోలీసు స్టేషన్లతో సమన్వయం, స్పందించే విధానంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే స్పందించి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించడం ద్వారా నేరాల నియంత్రణతో పాటు రహదారి భద్రతను మరింత బలోపేతం చేయవచ్చని అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.
ఈ తనిఖీల సందర్భంగా తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, ఎస్‌ఐ గంగరాజు తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment