పూర్తయిన జర్నలిస్టుల ఇండ్లకు బిల్లులు విడుదల చేయాలి: సబ్ కలెక్టర్‌కు వినతి

 

పూర్తయిన జర్నలిస్టుల ఇండ్లకు బిల్లులు విడుదల చేయాలి: సబ్ కలెక్టర్‌కు వినతి

పూర్తయిన జర్నలిస్టుల ఇండ్లకు బిల్లులు విడుదల చేయాలి: సబ్ కలెక్టర్‌కు వినతి

నారాయణఖేడ్, జూలై 7: నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో జర్నలిస్టులకు ప్రభుత్వం కేటాయించిన గృహాల నిర్మాణానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జర్నలిస్టులు మంగళవారం సబ్ కలెక్టర్ ఉమ హారతికి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో పలువురు ఇళ్ల నిర్మాణాన్ని ఇప్పటికే పూర్తి చేశారని తెలిపారు. పూర్తయిన ఇళ్లకు వెంటనే ఇంటి నంబర్లు కేటాయించి, పెండింగ్‌లో ఉన్న బిల్లులను మంజూరు చేసి విడుదల చేయాలని కోరారు.

అదేవిధంగా జర్నలిస్టుల కాలనీలో రహదారులు, తాగునీటి సౌకర్యం, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను కల్పించి కాలనీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.

వినతిపై స్పందించిన సబ్ కలెక్టర్ ఉమ హారతి సంబంధిత అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు అమృత్, శ్రీకాంత్, పుండరీకం, మధుసూదన్, ఖైసర్, గోవర్ధన్, శ్రీనివాస్, రమేష్, మజహర్ ఖాన్ చిస్తీ, సంగప్ప, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.