ఒవైసీ విద్యాసంస్థల భవనంపై హైకోర్టు స్టేటస్ కో.. కూల్చివేతకు తాత్కాలిక బ్రేక్

 

ఒవైసీ విద్యాసంస్థల భవనంపై హైకోర్టు స్టేటస్ కో.. కూల్చివేతకు తాత్కాలిక బ్రేక్

ఒవైసీ విద్యాసంస్థల భవనంపై హైకోర్టు స్టేటస్ కో.. కూల్చివేతకు తాత్కాలిక బ్రేక్

హైదరాబాద్: సలకం చెరువు పరిధిలో ఉన్న ఒవైసీ విద్యాసంస్థల భవనాన్ని కూల్చివేయొద్దని హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది. భవనం కూల్చివేతకు సంబంధించి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆరోపిస్తూ విద్యాసంస్థల యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది.

పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం భవనంపై ప్రస్తుత పరిస్థితిని యథాతథంగా కొనసాగించాలని ఆదేశించింది. దీంతో భవనాన్ని కూల్చివేయాలనే ప్రభుత్వ చర్యలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదిస్తూ, సంబంధిత భవనం సలకం చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (FTL) పరిధిలో ఉందని, ఈ అంశంపై ఇప్పటికే మరో ధర్మాసనం ఎదుట విచారణ కొనసాగుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

అయితే విద్యాసంస్థల యాజమాన్యం తరఫు న్యాయవాది, భవనాన్ని క్రమబద్ధీకరించేందుకు బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీం (BRS) కింద దరఖాస్తు చేసుకున్నామని, ఆ ప్రక్రియ పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో కూల్చివేత చర్యలు చేపట్టడం సరికాదని వాదించారు.

వాదనలు పరిశీలించిన హైకోర్టు భవనంపై స్టేటస్ కో విధిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 3కు వాయిదా వేసింది. దీంతో ఈ వ్యవహారంపై తదుపరి విచారణ వరకు యథాతథ పరిస్థితి కొనసాగనుంది.

Blogger ఆధారితం.