సుజాతనగర్ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
సుజాతనగర్ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా కలెక్టర్ అంకిత్ IAS సుజాతనగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం అమలు, ఆహార నాణ్యత, పరిశుభ్రత, మెనూ అమలు తీరును పరిశీలించారు.
విద్యార్థులకు ప్రతిరోజూ నాణ్యమైన, పోషకాహారంతో కూడిన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకం అమలులో నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని స్పష్టం చేశారు.
అనంతరం విద్యార్థుల హాజరు శాతంపై ఆరా తీసిన కలెక్టర్, ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అలాగే పాఠశాలలో పరిశుభ్రత, విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులకు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ IAS మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన సౌకర్యాలు, పోషకాహారం అందించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అని తెలిపారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Post a Comment