ఎదురెదురుగా వచ్చిన APSRTC బస్సులు.. ప్రమాదం తప్పించబోయి బోల్తా.. 60 మందికి స్వల్ప గాయాలు

 

ఎదురెదురుగా వచ్చిన APSRTC బస్సులు.. ప్రమాదం తప్పించబోయి బోల్తా.. 60 మందికి స్వల్ప గాయాలు
ఎదురెదురుగా వచ్చిన APSRTC బస్సులు.. ప్రమాదం తప్పించబోయి బోల్తా.. 60 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు

ప్రకాశం జిల్లా: ప్రకాశం జిల్లాలో శనివారం ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఓంగోలు మీదుగా కొండపి నుంచి మద్దులూరుకు వెళ్తున్న APSRTC బస్సు, ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టకుండా తప్పించే ప్రయత్నంలో ద్వారక సీ ఫుడ్ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు, అందులో 20 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి వారిని కొండపి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

రోడ్డు పక్కన పెరిగిన దట్టమైన ముళ్ల పొదల కారణంగా ఎదురుగా వస్తున్న బస్సు స్పష్టంగా కనిపించకపోవడమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని స్థానికులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను గుర్తించేందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Blogger ఆధారితం.