అశ్వారావుపేట గిరిజన బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్

అశ్వారావుపేట గిరిజన బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్

అశ్వారావుపేట గిరిజన బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని గిరిజన బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన, పోషకాహారం అందించాలని వార్డెన్‌కు సూచించారు.

వసతి గృహంలో పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, ఇతర మౌలిక వసతుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.

తనిఖీ సందర్భంగా వసతి గృహం భవనం పైకప్పు నుంచి వర్షపు నీరు లీకేజీ అవుతున్న విషయాన్ని కలెక్టర్ గుర్తించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే పైకప్పుకు మరమ్మతులు చేపట్టాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు.

విద్యార్థులకు సురక్షితమైన, అనుకూలమైన వాతావరణంలో వసతి కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలను అత్యవసరంగా చేపట్టాలని కలెక్టర్ సూచించారు.

Blogger ఆధారితం.