మొక్కల రాజశేఖర్‌కు ఘన సన్మానం టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు

మొక్కల రాజశేఖర్‌కు ఘన సన్మానం టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు
 మొక్కల రాజశేఖర్‌కు ఘన సన్మానం టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు

సుజాతనగర్: హరిత విప్లవమే లక్ష్యంగా గత ఆరేళ్లుగా ప్రతిరోజూ ఒక మొక్కను నాటుతూ కొత్తగూడెం ప్రాంతానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన "మొక్కల రాజశేఖర్"గా ప్రసిద్ధి చెందిన కొట్టూరు నుర్వి రాజశేఖర్‌కు ఘన సన్మానం జరిగింది. టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ సంగం వెంకట పుల్లయ్య కలిసి ఆయన స్వగృహంలో శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ, "మొక్కను రక్షించు – మాతృభాషను రక్షించు" అనే నినాదంతో సింగరేణి ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూనే తన తండ్రి పాండు ప్రేరణతో ప్రతిరోజూ ఒక మొక్కను నాటుతూ పర్యావరణ పరిరక్షణకు రాజశేఖర్ విశేష సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ఆయన కృషిని ఆదర్శంగా తీసుకుని ఇప్పటికే అనేక మంది హరిత దీక్షలు చేపట్టి మొక్కలు నాటడం అభినందనీయమన్నారు.

పెరుగుతున్న కాలుష్య పరిస్థితుల్లో చెట్లు, మొక్కల ప్రాధాన్యాన్ని సమాజానికి తెలియజేస్తూ నిరంతరం పర్యావరణ పరిరక్షణ కోసం రాజశేఖర్ చేస్తున్న సేవలు ఎంతో గొప్పవని, ఆయన కృషి మరెందరికో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో యంగ్ ఇండియా బ్లడ్ బ్యాంక్‌కు చెందిన బాలు, రామవరం పరిరక్షణ సమితి ప్రతినిధి ముస్తఫా తదితరులు పాల్గొని రాజశేఖర్‌ను అభినందించారు.

Blogger ఆధారితం.