గోదావరి వరద ఉద్ధృతి: సారపాక–రెడ్డిపాలెం, తూర్పాక–దుమ్ముగూడెం రహదారులను పరిశీలించిన కలెక్టర్ అంకిత్

 

గోదావరి వరద ఉద్ధృతి: సారపాక–రెడ్డిపాలెం, తూర్పాక–దుమ్ముగూడెం రహదారులను పరిశీలించిన కలెక్టర్ అంకిత్

గోదావరి వరద ఉద్ధృతి: సారపాక–రెడ్డిపాలెం, తూర్పాక–దుమ్ముగూడెం రహదారులను పరిశీలించిన కలెక్టర్ అంకిత్

గోదావరి వరద ఉద్ధృతి నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం సాయంత్రం సారపాక–రెడ్డిపాలెం, తూర్పాక–దుమ్ముగూడెం ప్రధాన రహదారులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద పరిస్థితులను అధికారులతో సమీక్షిస్తూ ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.

సారపాక–రెడ్డిపాలెం ప్రధాన రహదారిపై గోదావరి నీటి మట్టం మరింత పెరిగితే వరద నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. దీంతో అవసరమైతే వెంటనే బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు, ప్రజలు ఆ మార్గంలో ప్రయాణించకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు, రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

అనంతరం తూర్పాక–దుమ్ముగూడెం ప్రధాన రహదారిని పరిశీలించిన కలెక్టర్ అంకిత్, ఇప్పటికే వరద నీరు చేరడంతో రాకపోకలను నిలిపివేసి రహదారిని మూసివేసినట్లు అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. రహదారి వద్ద ఏర్పాటు చేసిన బ్యారికేడ్ల వద్ద నిరంతరం పోలీసు బందోబస్తు కొనసాగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు వరద నీటిలో ప్రయాణించకుండా కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలను వెంటనే అమలు చేయాలని, ప్రజల ప్రాణ భద్రతకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు

Blogger ఆధారితం.