డిస్ట్రిబ్యూటరీ కెనాల్ భూసేకరణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్

 

డిస్ట్రిబ్యూటరీ కెనాల్ భూసేకరణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్

డిస్ట్రిబ్యూటరీ కెనాల్ భూసేకరణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్

ములకలపల్లిలో క్షేత్రస్థాయి తనిఖీ – భూసేకరణ సర్వే వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ములకలపల్లి గ్రామంలో చేపడుతున్న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ భూసేకరణ పనులను జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూసేకరణ సర్వే పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుని, ఎలాంటి జాప్యం లేకుండా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూసేకరణ ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. సర్వే ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా నిర్వహించి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ములకలపల్లి గ్రామ పరిధిలో మొత్తం 160 ఎకరాల భూమికి సర్వే నిర్వహించాల్సి ఉండగా, ఇప్పటివరకు 22 ఎకరాల సర్వే పూర్తైనట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. మిగిలిన భూసర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

సర్వే నిర్వహించే సమయంలో ప్రతి భూ యజమానికి సంబంధించిన వివరాలతో పాటు బోర్లు, సాగులో ఉన్న పంటలు, ఆయిల్ పామ్ తోటలు, ఇతర శాశ్వత ఆస్తుల వివరాలను క్షుణ్ణంగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు. భూసేకరణ ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ తనిఖీలో ములకలపల్లి తహసీల్దార్ స్వాతి బిందు, ఇరిగేషన్ శాఖ అధికారులు, సర్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.