పాల్వంచ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి వైద్య శిబిరం

 

పాల్వంచ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి వైద్య శిబిరం

పాల్వంచ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి వైద్య శిబిరం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని మండల పరిషత్ హైస్కూల్ ఎర్రగుంటలో నవ లిమిటెడ్ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) కార్యక్రమంలో భాగంగా, ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ (ఎల్‌వీపీఐ) సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని బుధవారం నిర్వహించింది.

ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖాధికారి డి. వాసంతి ముఖ్య అతిథిగా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ గౌరవ అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా డీఈవో డి. వాసంతి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మౌలిక సదుపాయాలు కల్పించడంలో నవ లిమిటెడ్ చేస్తున్న సేవలను అభినందించారు. విద్యార్థుల కంటి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ మాట్లాడుతూ విద్యార్థులు కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నవ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఎన్. సురేష్ చంద్ర, ఎల్‌వీపీఐ అడ్మినిస్ట్రేటర్ సి. దేవి చంద్రరావు, సీఎస్‌ఆర్ మేనేజర్ సి.హెచ్. శ్రీనివాసరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి. సుధారాణి, పాఠశాల ఉపాధ్యాయులు, సీఎస్‌ఆర్ సిబ్బంది, నవభారత్ కంటి వైద్య బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.