బొగ్గు గని కార్మికులకు 25 శాతం ఇంటీరియం రిలీఫ్ చెల్లించాలి హెచ్‌ఎంఎస్ డిమాండ్

 

బొగ్గు గని కార్మికులకు 25 శాతం ఇంటీరియం రిలీఫ్ చెల్లించాలి హెచ్‌ఎంఎస్ డిమాండ్.. సింగరేణిలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, 35 శాతం లాభాల వాటా ఇవ్వాలని విజ్ఞప్తి

బొగ్గు గని కార్మికులకు 25 శాతం ఇంటీరియం రిలీఫ్ చెల్లించాలి హెచ్‌ఎంఎస్ డిమాండ్.. సింగరేణిలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, 35 శాతం లాభాల వాటా ఇవ్వాలని విజ్ఞప్తి

మణుగూరు: దేశంలోని బొగ్గు గని కార్మికులకు 12వ వేతన ఒప్పందం అమలులోకి వచ్చే వరకు 25 శాతం ఇంటీరియం రిలీఫ్ (ఐఆర్) చెల్లించాలని హింద్ మజ్దూర్ సభ (హెచ్‌ఎంఎస్) డిమాండ్ చేసింది. కోల్ ఇండియా యాజమాన్యం వెంటనే 12వ వేతన కమిటీని ఏర్పాటు చేసి, వేతన ఒప్పంద ప్రక్రియను ప్రారంభించాలని హెచ్‌ఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ కోడిపల్లి శ్రీలత కోరారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటు బొగ్గు రంగ సంస్థల యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ 12వ వేతన ఒప్పందం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు. లేబర్ కోడ్లను అడ్డుపెట్టుకుని దేశంలోని బొగ్గు రంగ సంస్థల్లో ఎన్నికలు నిర్వహించి, 51 శాతం మెజారిటీ ఓట్లు సాధించిన సంఘంతోనే వేతన ఒప్పందాలు చేస్తామని చెప్పడం కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధమని పేర్కొన్నారు.

కోల్ ఇండియా యాజమాన్యం గనుల రంగంలోని గుర్తింపు పొందిన సంఘాలను పిలిచి 12వ వేతన కమిటీని ఏర్పాటు చేయకుండా జాప్యం చేస్తోందని శ్రీలత విమర్శించారు. కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడి, వేతన ఒప్పందం జరిగే వరకు బొగ్గు రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ 25 శాతం ఇంటీరియం రిలీఫ్ చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు.

సింగరేణి కార్మికులకు కూడా 25 శాతం ఐఆర్ ఇవ్వాలి

సింగరేణి కాలరీస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, డైరెక్టర్ (పర్సనల్) స్పందించి గతంలో మాదిరిగానే వేతన ఒప్పందం పూర్తయ్యే వరకు సింగరేణి కార్మికులకు 25 శాతం ఇంటీరియం రిలీఫ్ చెల్లించాలని హెచ్‌ఎంఎస్ తరఫున కోరుతున్నట్లు శ్రీలత తెలిపారు. వేతన ఒప్పందం పూర్తైన అనంతరం పెరిగిన పూర్తి వేతనాలను కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి

సింగరేణి సంస్థలో ఉద్యోగ ఖాళీల భర్తీపై కూడా హెచ్‌ఎంఎస్ పలు డిమాండ్లు చేసింది. 2024లో జూనియర్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేస్తామని సంస్థ నోటిఫికేషన్‌ జారీ చేసినప్పటికీ ఇప్పటివరకు సుమారు 1,000 ఖాళీలు భర్తీ కాలేదని శ్రీలత తెలిపారు.

జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో పాటు సెక్యూరిటీ విభాగంలోని ఖాళీలను, సంస్థలో అంతర్గతంగా ఏర్పడిన ఇతర ఖాళీలను కూడా యుద్ధ ప్రాతిపదికన సంబంధిత పరీక్షలు నిర్వహించి భర్తీ చేయాలని కోరారు.

కార్మికులకు 35 శాతం లాభాల వాటా ఇవ్వాలి

2025-26 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థకు వచ్చిన నికర లాభాల నుంచి కార్మికులకు 35 శాతం లాభాల వాటాను చెల్లించాలని హెచ్‌ఎంఎస్ డిమాండ్ చేసింది. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కూడా 10 శాతం లాభాల వాటా చెల్లించాలని కోరారు.

కార్మికుల న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం, ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో తీవ్ర స్థాయిలో పోరాటాలు చేపట్టాల్సి వస్తుందని కోడిపల్లి శ్రీలత హెచ్చరించారు.

Blogger ఆధారితం.