కొత్తగూడెం ఏరియా జీఎం సీహెచ్ వెంకటరమణకు టీబీజీకేఎస్ ఘన సన్మానం
కొత్తగూడెం ఏరియా జీఎం సీహెచ్ వెంకటరమణకు టీబీజీకేఎస్ ఘన సన్మానం
కొత్తగూడెం: తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సీహెచ్ వెంకటరమణకు శనివారం ఘన సన్మానం నిర్వహించారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆయనను యూనియన్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా టీబీజీకేఎస్ నాయకులు మాట్లాడుతూ, జీఎం సీహెచ్ వెంకటరమణ నాయకత్వంలో కొత్తగూడెం ఏరియా అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం జీఎం యూనియన్ నాయకులతో ఆత్మీయంగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ, ఏరియా ఉపాధ్యక్షులు గడప రాజయ్య, సెంట్రల్ కమిటీ నాయకులు బోరింగ్ శంకర్, కాగితపు విజయ్, గిన్నారపు మహేందర్, మాదాసు ఈశ్వరరావు, ఫిట్ సెక్రటరీ నమిల్ల వెంకటేశ్వర్లు, కంచర్ల రాజేష్, కాజా పాషా, కిష్టారం పిట్ సెక్రటరీ కే. ఆంజనేయులు, ఆరే దివ్య, అనుదీప్, ఎన్. శంకర్, దేవ్ సింగ్, కిరణ్ కుమార్, గంధమల్ల దుర్గ, తిరుపతి, విద్యాసాగర్, రంజిత్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment