నవ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత దంత వైద్య శిబిరం

 

నవ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత దంత వైద్య శిబిరం

నవ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత దంత వైద్య శిబిరం

పాల్వంచ, ఆగస్టు 3: నవ లిమిటెడ్ పాల్వంచ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) కార్యక్రమంలో భాగంగా పాల్వంచ జగన్నాధపురం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరాన్ని నవ లిమిటెడ్, పాల్వంచ మరియు హైదరాబాద్‌కు చెందిన రోహిణి ఫౌండేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేశాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డా. తుకారాం రాథోడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "ఓరల్ కేర్ అండ్ ఐరన్ హెల్తీ చైల్డ్" కార్యక్రమం ద్వారా విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపడం అభినందనీయమని అన్నారు. పిల్లల్లో దంత ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

జిల్లా విద్యాశాఖ కార్యాలయ ప్రతినిధి శ్రీ సైదులు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో నవ లిమిటెడ్ సీఎస్‌ఆర్ సేవలను ప్రశంసించారు. టీచర్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన, విద్యార్థులకు బల్లలు, డిజిటల్ పరికరాలు, మొబైల్ సైన్స్ ల్యాబ్, ట్యూషన్లు, కంప్యూటర్ ఉపాధ్యాయుల నియామకం, ఫర్నిచర్, అదనపు తరగతి గదుల నిర్మాణం వంటి అనేక కార్యక్రమాలను సంస్థ విజయవంతంగా చేపడుతోందని తెలిపారు.

నవ లిమిటెడ్ సీఎస్‌ఆర్ హెడ్ డి. సుధాకర్ మాట్లాడుతూ సంస్థ చేపడుతున్న వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను వివరించారు. విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంస్థ నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి (ఎంఈఓ) శ్రీరామూర్తి, సీఎస్‌ఆర్ హెడ్ డి. సుధాకర్, లైజన్ అధికారి సి.వి.వి.ఎస్. మూర్తి, డీజీఎం (కమర్షియల్) ఎన్. ప్రసాద్, సీఎస్‌ఆర్ మేనేజర్ సి.హెచ్. శ్రీనివాస్, సీఎస్‌ఆర్ సిబ్బంది, రోహిణి ఫౌండేషన్ వైద్య బృందం, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.