మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి నివాసంలో వైభవంగా వరలక్ష్మీ వ్రతం

మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి నివాసంలో వైభవంగా వరలక్ష్మీ వ్రతం


మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి నివాసంలో వైభవంగా వరలక్ష్మీ వ్రతం

భద్రాద్రి కొత్తగూడెం: మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి నివాసంలో వరలక్ష్మీ వ్రత వేడుకలు అంగరంగ వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో నిర్వహించారు. శ్రావణ మాస పవిత్రతను చాటుతూ భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రత్యేక అలంకరణల నడుమ వరలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు, వ్రత కార్యక్రమాలను నిర్వహించారు. ఇరుగుపొరుగు మహిళలు, బంధువులు, ఆడపడుచులు పెద్ద సంఖ్యలో హాజరై సంప్రదాయబద్ధంగా వాయనాలు మార్చుకున్నారు. పుష్పాలు, ఫలాలు సమర్పిస్తూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించారు.

ఈ సందర్భంగా సీతాలక్ష్మి ప్రథమ పుత్రుడు జినిత్ ఈశ్వరి కుమార్తె మహాలక్ష్మి (గుణద్య) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ చిన్నారిని ముత్తైదువులు, ఆడపడుచులు ఆశీర్వదించారు. చిన్నారి విద్యాభివృద్ధి, సత్ప్రవర్తన, సకల సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని దీవెనలు అందించారు.

పూజా కార్యక్రమాల అనంతరం విచ్చేసిన మహిళలు, భక్తులకు వాయనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. మహిళల సందడితో సీతాలక్ష్మి నివాసంలో పండుగ వాతావరణం నెలకొంది.

Blogger ఆధారితం.