ప్రపంచ రేబిస్ దినోత్సవం – రేబిస్ నిరోధక టీకాల పంపిణీ

ప్రపంచ రేబిస్ దినోత్సవం – రేబిస్ నిరోధక టీకాల పంపిణీ


కొత్తగూడెం, సెప్టెంబర్ 28: ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ప్రాంతీయ పశువైద్యశాలలో రేబిస్ వ్యాధి నిరోధక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 58 పెంపుడు జంతువులకు రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు వేశారు. అదేవిధంగా 25 పెంపుడు జంతువులకు ఉచితంగా నటన నివారణ మందులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి జిల్లా పశువైద్య పశుసంవర్ధక అధికారి డాక్టర్ ఎం. వెంకటేశ్వర్లు, ప్రాథమిక పశువైద్యశాల రామవరం డాక్టర్ జి. ఆనంద్ రావు, ప్రాథమిక పశువైద్యశాల సుజాతనగర్ డాక్టర్ కాత్యాయని, ప్రాథమిక పశువైద్యశాల అన్నపురెడ్డిపల్లి డాక్టర్ రాజేష్, లైవ్ స్టాక్ సూపర్వైజర్ ఇబ్రహీం, జూనియర్ అసిస్టెంట్ హరదీప్, ఇతర పరిశోధ సిబ్బంది పాల్గొన్నారు.

రేబిస్ వంటి ప్రమాదకర వ్యాధి నుండి జంతువులు మరియు మనుషుల రక్షణకై టీకాలు తప్పనిసరిగా వేయాలని వైద్యులు ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.