అడవి పందులను హతమార్చిన నలుగురు అరెస్ట్
బెల్లంపల్లి, సెప్టెంబర్ 28: బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామంలో అడవి పందులను అక్రమంగా వేటాడిన ఘటన వెలుగుచూసింది. పత్తి చేనులో విద్యుత్ వైర్లు అమర్చి రెండు అడవి పందులను హతమార్చిన కేసులో నలుగురు నిందితులను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బెల్లంపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పూర్ణచందర్ వివరాల ప్రకారం, స్థానిక శ్రీనివాస్ పందులను విద్యుత్ షాక్‌తో హతమార్చి వాటిని రాజన్న, సాయికి విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ కావడంతో వారిని అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి అడవి పంది మాంసాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు రేంజ్ ఆఫీసర్ స్పష్టం చేశారు.
Post a Comment