20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్, మరియు సహాయకుడు
రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల మండల తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి ఘటన వెలుగుచూసింది. ఫిర్యాదుదారుని తల్లి పేరుపై ఉన్న భూమి సర్వే చేయడం మరియు పంచనామా ప్రతిని ఇవ్వడం కోసం మండల సర్వేయర్ మాడిశెట్టి వేణుగోపాల్ రూ.30,000/- లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణ.
ఆ డిమాండ్‌లో భాగంగా ఇప్పటికే రూ.10,000/- స్వీకరించిన అతడు, మిగిలిన రూ.20,000/- తీసుకుంటూ ఉండగా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డాడు. అతనితో పాటు అతని ప్రైవేట్ సహాయకుడు సూర వంశీ కూడా ఈ ఘటనలో అదుపులోకి తీసుకున్నారు.
ఏసీబీ అధికారులు సర్వేయర్ వద్ద నుండి నగదు స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ప్రజలకు సూచన:
ఎవరి దగ్గరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగినట్లయితే, వెంటనే తెలంగాణ అవినీతి నిరోధకశాఖ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు కాల్ చేయవచ్చు. అదేవిధంగా
- వాట్సాప్: 9440446106
- ఫేస్‌బుక్: Telangana ACB
- ఎక్స్ (Twitter): @TelanganaACB
- వెబ్‌సైట్: acb.telangana.gov.in
ఫిర్యాదుదారుల / బాధితుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఏసీబీ అధికారులు తెలిపారు.

Post a Comment