సుజాతనగర్ పోలీసులు భారీగా 2.5 కోట్లు గంజాయి స్వాధీనం
సుజాతనగర్, అక్టోబర్ 13: భద్రాచలం నుండి రాజస్థాన్ జైపూర్‌కి అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను సుజాతనగర్ పోలీసులు పట్టుకున్నారు. ఈ దాడిలో సుమారు 499 కిలోల ప్రభుత్వ నిషేదిత గంజాయి, మార్కెట్ విలువ రూ.2.5 కోట్లుగా అంచనా.
CCS పోలీసులు, సుజాతనగర్ ఎస్సై రమాదేవి గారితో కలిసి వేపలగడ్డ గ్రామంలోని అన్నపూర్ణ బేకరీ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో KA38A6754 నంబరు గల అశోక్ లేలాండ్ కంటైనర్ లారీని ఆపి తనిఖీ చేయగా, అందులో 96 గంజాయి ప్యాకెట్లు దొరికాయి.
పోలీసులు జగదీశ్ దయారాం పాటిల్ (మహారాష్ట్ర) మరియు సంజు కుమార్ @ సంజీవ్ (కర్ణాటక) అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిద్దరూ గంజాయి రవాణాలో పాలుపంచుకున్నట్లు విచారణలో తేలింది.
పోలీసుల సమాచారం ప్రకారం, నిందితులు ఓడిశా రాష్ట్రానికి చెందిన హరి వద్ద గంజాయి కొనుగోలు చేసి, రాజస్థాన్‌లోని జైపూర్‌కు తరలించే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంలో మహారాష్ట్రకు చెందిన అమిత్ రోహిదాస్ పాటిల్ కూడా కీలక పాత్ర పోషించాడు. వీరిద్దరు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
గంజాయి రవాణా కోసం లారీ డ్రైవర్ సంజు కుమార్ రూ.4.5 లక్షలకు ఒప్పందం చేసుకుని, రూ.1.5 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
స్వాధీనం చేసిన వస్తువుల్లో —
- 96 గంజాయి ప్యాకెట్లు (మొత్తం 499 కిలోలు)
- రూ. 2.5 కోట్లు విలువ
- ఒక కంటైనర్ లారీ (KA38A6754)
- రెండు మొబైల్ ఫోన్లు ఉన్నాయి.

Post a Comment