కర్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్‌ను మర్యాదపూర్వకంగా కలసిన మోహీద్ పటేల్
నారాయణఖేడ్ ఎంఐఎం అధ్యక్షుడు మోహీద్ పటేల్ – జిల్లా ఇన్‌చార్జి కౌసర్ మొహియుద్దీన్‌ను కలిసారు
హైదరాబాద్ దారుస్సలాం అక్టోబర్ 13: ఎంఐఎం పార్టీ నారాయణఖేడ్ అధ్యక్షుడు న్యాయవాది మోహీద్ పటేల్ సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయం దారుస్సలాంలో ఎంఐఎం సంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి, కర్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో పార్టీ వ్యూహం, అభ్యర్థుల ఎంపికపై ఇద్దరూ చర్చించారు.
మోహీద్ పటేల్ మాట్లాడుతూ – “సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ దిశగా పార్టీ బలోపేతానికి కౌసర్ మొహియుద్దీన్ గారు సూచనలు ఇచ్చారు” అని తెలిపారు.
అలాగే నారాయణఖేడ్‌లోని మైనార్టీ సమస్యలను పరిశీలించేందుకు, నాయకులను ప్రోత్సహించేందుకు జిల్లా ఇన్‌చార్జి త్వరలో నారాయణఖేడ్ పర్యటన చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు షేక్ అంజేద్, శైక్ సిరాజ్, శైక్ ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment