తెలంగాణలో భారీ వర్షాల అలర్ట్: ఐఎండీ హెచ్చరిక
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మరోసారి వర్షాలు విరజిమ్మే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇవాళ, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అక్టోబర్ నెల ప్రారంభం కాగానే చలి ప్రారంభమవుతుందని ప్రజలు భావించినా, వర్షాలు మళ్లీ మొదలవడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
వాతావరణ శాఖ వివరాల ప్రకారం, ఉత్తర భారతదేశం నుండి ప్రారంభమైన నైరుతీ రుతుపవనాలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ రుతుపవనాలు ఈ నెల 24వ తేదీ తర్వాత తగ్గుముఖం పట్టి, 15వ తేదీ నాటికి పూర్తిగా నిష్క్రమించే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
హైదరాబాద్‌లో పగలంతా పొడి వాతావరణం ఉండి, రాత్రి ఉరుములు–మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని అధికారులు తెలిపారు.
ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆదివారం రాత్రి నుండి ఈరోజు తెల్లవారుజాము వరకు భారీ వర్షాలు కురిశాయి.
- వలిగొండలో 190.8 మి.మీ. వర్షపాతం,
- ఆత్మకూరు లో 131 మి.మీ.,
- మోతుకూరు మండలంలోని దట్టప్పగూడలో 120.5 మి.మీ.,
- మహబూబాబాద్ మండలం అయ్యగారి పల్లెలో 117.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.
ఈ భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి, ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Post a Comment